సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ-సమీకృత కార్యాలయ సముదాయ భవన్లో గురువారం సాయంత్రం ఇరిగేషన్ ఎస్ఈ వేణు, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో సంగారెడ్డి-రామాయంపేట ప్రధాన కాలువ భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంగారెడ్డి-రామాయంపేట ప్రధాన కాలువ భూ సేకరణ చేయాల్సి ఉందని, ఇరు శాఖల అధికారులు సమన్వయంతో తొందరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ మేరకు సంగారెడ్డి-రామాయంపేట ప్రధాన కాలువ భూ సేకరణ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ దీపక్ తివారీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం