సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు చీరలను పంపిణీ చేస్తుండగా తెరాస నాయకులు అడ్డుపడ్డారు. రాయపోల్ మండలం తిమ్మక్కపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై చీరలను పెట్టుకొని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు.
విషయం గుర్తించిన తెరాస నాయకులు వారిని అడ్డుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనం, చీరలను స్వాధీనం చేసుకుని... చీరల పంపిణికి పాల్పడిన ముగ్గురు యువకులపై కేసునమోదు చేశారు.
ఇదీ చూడండి: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన