సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ప్రజల నుంచి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించడానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వ హిందు పరిషత్ పిలుపు మేరకు భార్గవపురం సేవాసమితి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ నాయకుడు రాఘవులు హాజరయ్యారు.
"అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతి హిందు కుటుంబం నుంచి యోగదానం ఉండాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా 2021 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ప్రతి గ్రామంలో ఇంటి ఇంటికి రామ భక్తులు విరాళాలకు వచ్చినప్పుడు ప్రతి కుటుంబం పది రూపాయలపైన ఎంతో కొంత దానం చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలి. అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం చేయడంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం కలగకపోయినప్పటికీ.. నిర్మాణంలోనైనా ప్రజలందరూ భాగస్వాములు కావాలి. "
-రాఘవులు, ఆర్ఎస్ఎస్ నాయకుడు
ఇదీ చూడండి: సృజనాత్మకతతో అబ్బురపరిచిన విద్యార్థులు