సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పోలీసు నియామక ఉచిత శిక్షణా శిబిరాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని, అవసరాలకు కావలసిన వనరులను సమకూరుస్తామని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అన్నారు. స్పోర్ట్స్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, యూనిఫామ్ అందిస్తామని పేర్కొన్నారు.
సద్వినియోగం చేసుకోండి
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం.. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 పోలీస్ నియామక ఉచిత శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసిందని.. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం అభినందనీయమని హరీశ్ తెలిపారు. శిక్షణ తరగతులకు ప్రతిరోజూ హాజరుకావాలని సూచించారు. నిరంతర ప్రయత్నంతోనే అనుకున్న లక్ష్యాలను చేరవచ్చని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
పీటీసీ పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో 450 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వస్తే 170 మంది అభ్యర్థులు అర్హత సాధించారని మంత్రి పేర్కొన్నారు. శిక్షణలో ఉన్న అభ్యర్థులకు ఎలాంటి అవసరం ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి: నగరం నిద్రపోతున్న వేళ.. దొంగల చేతివాటం