బహిరంగ విపణిలో కిలో ఉల్లి 100 రూపాయలు పడుతున్నందును కొనేందుకు జనాలు జంకుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు. అందులో భాగంగానే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీ ఉల్లి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం వద్ద ఒక్కో వ్యక్తికి 40 రూపాయలకి కిలో చొప్పున ఉల్లి గడ్డలు ఇస్తున్నందున ప్రజలు బారులు తీరుతున్నారు. ఏర్పాటు చేసిన మార్కెట్‌ని తిలకించేందుకు వస్తున్న ప్రజలంతా రాయితీ ఉల్లి కేంద్రం వద్ద క్యూలో నిల్చున్నారు. ఈ రాయితీ కేంద్రంతో కొంత ఉపశమనం కలిగించి నట్లయితే ఉందని ప్రజలు అంటున్నారు.
ఇవీ చూడండి: బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ