సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక చవితి శాంతిభద్రతల నేపథ్యంలో సమావేశం జరిగింది. చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి సమస్యలు, ఆటంకాలు సృష్టించకుండా, సామరస్యంగా జరుపుకోవాలని దౌలతాబాద్ ఎస్ఐ సూచించారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని అన్నారు. గణేష్ మండపాల వద్ద డీజే సౌండ్ నిషేధించామని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఆదర్శం... ఈసారి మిట్టపల్లిలో వినాయకుడు మురిసేలా వేడుకంట!