సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. సభ్యత్వ నమోదులో గజ్వేల్ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. నియెజకవర్గంలో ప్రతి ఇంటికి గులాబీ సభ్యత్వం ఉండేలా కృషి చేయాలన్నారు. తొలి సభ్యత్వాన్ని మెదక్ జిల్లా జడ్పీ ఛైర్మన్ హేమలత చేతుల మీదుగా మున్సిపల్ ఛైర్మన్ గడిపల్లి భాస్కర్ తీసుకున్నారు.
ఇదీ చదవండిః సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం