సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన నిధులతో ఆంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ బొమ్మ శ్రీరామ్ తెలిపారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని 20 రోజులుగా నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.
మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దృష్టికి అంబులన్స్ సమస్యను తీసుకెళ్లగా తన నిధుల నుంచి అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయమై జీవన్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. హుస్నాబాద్ ఆస్పత్రిని 100 పడకలుగా మార్చే విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి ధోనీ 'పబ్జీ' ఆపేసి ఆ గేమ్ ఆడుతున్నాడట!