సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి నివారణకు ఇంత త్వరగా వ్యాక్సిన్ రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటగా కొవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ 356మందికి 3రోజులపాటు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
వ్యాక్సిన్ వచ్చిందని నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థుల నుంచి దరఖాస్తు పత్రాలను స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ఉచితంగా మెటీరియల్, ఫ్యాకల్టీ ఖర్చులను తానే భరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతం : కేటీఆర్