సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆలయ కమిటీ ఛైర్మన్ దేవాదాయ శాఖ అధికారులతో జాతర నిర్వహణలో చేపట్టాల్సిన ఏర్పాట్లు నిధుల వ్యయంపై చర్చించారు.
జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండి అందుకు తగినట్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: ప్రగతిభవన్‌లో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం