ETV Bharat / state

పల్లె ప్రగతిలో సిద్దిపేట తొలిస్థానంలో నిలవాలి: హరీశ్​ - గజ్వేల్​లో పల్లె ప్రగతిపై సమీక్ష

పల్లెప్రగతి కార్యక్రమంతో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి బాట పడతాయని మంత్రి హరీశ్ రావు​ అన్నారు. 30 రోజుల ప్రణాళికలో పనిచేసిన విధంగా ఈ కార్యక్రమంలోనూ కృషిచేయాలని సూచించారు. సిద్దిపేటను తొలిస్థానంలో నిలపాలని కోరారు.

minister harish rao speaks on palle pragathi program
పల్లె ప్రగతిలో సిద్దిపేట తొలిస్థానంలో నిలవాలి: హరీశ్​
author img

By

Published : Dec 27, 2019, 5:09 PM IST

పల్లె ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి హరీశ్​రావు అన్నారు. రెండో విడత కార్యక్రమంపై సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షకు ఆయన హాజరయ్యారు. గజ్వేల్​ పట్టణంలోని మహతి ఆడిటోరియం ఇందుకు వేదికైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో సాధించిన పురోగతిపై మండలాల వారీగా మంత్రి సమీక్షించారు. మొదటి విడతలో మెరుగుపడని గ్రామ పంచాయతీలు, రెండవ దశలో మంచి ఫలితాలను సాధించాలన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతితోనే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని ఇదో విన్నూత కార్యక్రమమన్న హరీశ్​.. పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 30 రోజుల ప్రణాళికలో సర్పంచులు చాలా బాగా పనిచేశారని, రెండో విడతలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించి సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.

పల్లె ప్రగతిలో సిద్దిపేట తొలిస్థానంలో నిలవాలి: హరీశ్​

ఇవీచూడండి: పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​

Intro:tg_srd_17_27_manthri_harishrao_vo_ts10054
ashok Gajwel
పల్లె ప్రగతి ఇ ఒక అద్భుతమైన కార్యక్రమం అని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు రెండవ విడత పల్లె ప్రగతి పై గజ్వేల్ లో జిల్లాస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు

Body:రెండవ విడత పల్లె ప్రగతి పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ని మహతి ఆడిటోరియంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు 30 రోజుల ప్రణాళిక లో ఆయా గ్రామాల్లో సాధించిన పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు మొదటి విడతలో మెరుగు పడని గ్రామ పంచాయతీలు రెండవ విడతలో మంచి ఫలితాలను సాధించాలని సూచనలు చేశారు ఈ కార్యక్రమంపై పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతి తోనే సాధ్యమవుతుందన్నారు దేశంలోనే ఇది ఒక వినూత్న కార్యక్రమం అన్నారు పట్టణాలకు దీటుగా నేడు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి అన్నారు 30 రోజుల ప్రణాళిక లో సర్పంచులు చాలా బాగా పని చేశారని రెండో విడతలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి ఈ కార్యక్రమంలో లో ఈ సిద్ది పేట జిల్లా ను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.