ETV Bharat / city

పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​ - ktr speaks on municipal elections in telangana

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ భవన్​లో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్​ మాట్లాడారు. పల్లె ప్రగతి తరహాలోనే తర్వలో పట్టణ ప్రగతి నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

ktr speaks on municipal elections in telangana
పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​
author img

By

Published : Dec 27, 2019, 3:04 PM IST

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా తెరాసకు ప్రజలు మద్దతు తెలిపారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2014లో 63 సీట్లు గెలిచిన తెరాస... 2018లో 88 స్థానాల్లో గెలిచిందన్నారు. ప్రతీ ఎన్నికకు ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. నేల విడిచి సాము చేయట్లేదనడానికి ఇదే ఉదాహరణ అన్నారు.

పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. అదే తరహాలో పట్టణాల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించే విధంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త పంచాయతీ, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు.

జనవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారం చేయనున్నట్లు కేటీఆర్​ వెల్లడించారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరే ఆధారంగా ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు.

పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి: కేటీఆర్​

ఇదీ చదవండి:ఎమ్మెల్యేను కలిసేందుకు 90 కి.మీ పాదయాత్ర

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.