ETV Bharat / state

Harish Rao: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలి - మంత్రి హరీశ్​రావు సమీక్షా సమావేశం

సిద్దిపేటలోని ఐడీవోసీ(IDOC) మీటింగ్ హాల్‌లో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లతో.. మంత్రి హరీశ్​రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలి సూచించారు.

Minister Harish Rao review on paddy purchase in siddipet

author img

By

Published : Nov 5, 2021, 9:35 PM IST

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికాలను మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. సిద్దిపేటలోని ఐడీవోసీ(IDOC) మీటింగ్ హాల్‌లో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు, రైస్ మిల్లర్లతో.. మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒక లక్షా 22 వేల 989 హెక్టార్​లలో వరి సాగు చేయగా... గతంలో ఎన్నడూ లేనివిధంగా 7 లక్షల 62 వేల 533 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని మంత్రి తెలిపారు.

ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 225, ప్యాక్స్ ఆధ్వర్యంలో 156, ఏఎంసీ ఆధ్వర్యంలో 10, మెప్మా ఆధ్వర్యంలో 5.. కలిపి మొత్తం 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,960, కామన్ రకానికి రూ.1,940 కనీస మద్దతు ధరగా అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించామని మంత్రి తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు రాబోవు రోజుల్లో ధాన్యం పెద్ద స్థాయిలో రానుందని మంత్రి సూచించారు. వరి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి పంపినట్లయితే కొనుగోళ్లు త్వరగా జరగడమే కాకుండా రైతులకు ధాన్యం కోత ఉండదన్నారు. ఆ దిశగా రైతులకు అధికారులు చైతన్యం కల్పించాలని సూచించారు. గన్నీబ్యాగుల కొరత, రవాణా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఎఫ్​సీఐ ఇబ్బందులపై మంత్రి ఫిర్యాదు..

ఎఫ్​సీఐ మీద మంత్రికి మిల్లర్​లు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బందులకు గురి చేస్తుందని సిద్దిపేట జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.చంద్రశేఖర్... మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో గోదాముల కొరత అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగినంత నిష్పత్తిలో గోదాముల సామర్థ్యాన్ని ఎఫ్​సీఐ పెంచడం లేదన్నారు. దీనివల్ల స్టోరేజి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఫలితంగా మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. బియ్యాన్ని దించేందుకు స్థలం లేక గోదాముల ముందు రోజుల తరబడి వాహనాలు వేచిఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, వర్షాల వల్ల కొన్ని బియ్యం సంచులు తడిసినా.. లోడ్​ మొత్తాన్ని తిప్పి పంపుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గతంలో వర్షానికి తడిసిన బ్యాగులను రీప్లేస్ చేసేవాళ్లని.. ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తివేశారని తెలిపారు. ఫలితంగా ఒక్కో వాహనానికి లోడింగ్ అన్​లోడింగ్ కోసం 50 నుంచి 60 వేల మేర నష్టం వాటిల్లుతుందన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.