Minister Harish Rao on Congress Declarations : సిద్దిపేట జిల్లాలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట చింతల్ చెరువులో 52 వేల చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో ముడోసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీనని.. రాష్ట్ర ప్రజలు సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవి గౌడ కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav), డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ రోజాశర్మ, శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, గీతా పారిశ్రామిక కార్పొరేషన్ ఛైర్మన్ పల్లె రవిగౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
52 Thousand Baby Fish Distribution in Siddipet : మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్దిపేట చింతల్ చెరువులో మంత్రులిద్దరూ కలిసి 52 వేల చేప పిల్లల(Baby Fishes)ను వదిలారు. సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7200 మంది మత్స్యకారులకు మంత్రుల చేతుల మీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) మాట్లాడుతూ.. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకాలంటే కష్టంగా ఉండేదని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులతో అన్ని రకాల ఉపయోగం ఉంటుందని వివరించారు. 8 వేల మందికి కార్డులు ఇచ్చామని తెలియజేశారు.
Telangana fish brand : తెలంగాణ చేపలు.. ప్రత్యేక బ్రాండ్‌కు ప్రభుత్వ నిర్ణయం
Harish Rao Comments on Congress : మహా భారతంలో ధర్మాన్ని అనుసరించిన పాండవులు కౌరువులపై గెలిచారని.. అలానే రాష్ట్రంలో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమేనని హితవు పలికారు. కాంగ్రెస్ కౌరువుల పార్టీ అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజుకొక డిక్లరేషన్ ప్రకటిస్తుందని.. ప్రజలు ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదని ఎద్దేవా చేశారు.
"ఉచితంగా చేప పిల్లలు ఇచ్చింది.. భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. గుర్తింపు కార్డు ద్వారా బీమా వస్తుంది. ఇలానే మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి."- హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
Minister Srinivas Yadav Speech on Fish Farming : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.2 కోట్లు మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమబంగాల్‌కు చేపలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే చేపలు, రొయ్యలు, గొర్రెల పంపిణీ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు.
Harish Rao on Rythu Bhima Scheme : రైతు పక్షపాతి కేసీఆర్.. రైతు బీమాకు ఐదేళ్లు పూర్తి : హరీశ్‌రావు