అంబేడ్కర్ ఆలోచనా విధానాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలోని మహిళా భవన్లో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ప్రచురించడం వల్లే భారతదేశం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా ఉందన్నారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు నిధులు మంజూరు చేసిన ఖర్చు చేయలేదన్నారు. రెండు పడక గదుల ఇళ్లలోను ఎస్సీ,ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: దుబ్బాకపై కాంగ్రెస్ కసరత్తు.. ఉప ఎన్నికపై సన్నాహక సమావేశం