సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరుబండ స్వయంభూ లక్ష్మీనర్సింహ స్వామిని మంత్రి హరీశ్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు తెలంగాణ దేవాలయాల అభివృద్ధిపై వివక్షత చూపారని మంత్రి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రూ. 2 కోట్ల 50 లక్షలతో పుల్లూరుబండ ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.