సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అభివృద్ధిపై డివిజన్ స్థాయి అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల కమిషనర్, మున్సిపల్ సిబ్బందిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన రూ.50 లక్షలు నిధులు దేనికోసం ఉపయోగించారని ప్రశ్నించారు. కమిషనర్ రాజమల్లయ్య సరిగ్గా సమాధానం ఇవ్వనందున తీరు మార్చుకోవాలని మంత్రి సూచించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలు పరిష్కరించాలని.. లేదంటే తగు చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.
ఇదీ చూడండి: పగలు రెక్కీ... రాత్రి దొంగతనాలు