ETV Bharat / state

ఏర్పాట్లు చేయటం కూడా రాదా.. అధికారులపై హరీశ్​ ఫైర్​ - నీటి విడుదల కార్యక్రమంలో అధికారులపై మంత్రి హరీశ్​ ఫైర్​

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లో నిర్వహించిన నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి హరీశ్​రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనంతో అక్కడ ఏర్పాటు చేసిన సభకు వెళ్లకుండానే వెనుదిరిగారు.

minister harish rao fire on officers in water relese program at thoguta
నీటి విడుదల కార్యక్రమంలో అధికారులపై మంత్రి హరీశ్​ ఫైర్​
author img

By

Published : Jun 2, 2020, 9:22 PM IST

మల్లన్నసాగర్ పంప్​హౌస్ నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో అధికారులపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లోని పంప్​హౌస్ ద్వారా అప్రోచ్ కెనాల్ నుంచి దుబ్బాక ప్రధాన కాలువకు గేట్లను తెరిచి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లలో అధికారుల అలసత్వంపై మంత్రి మండిపడ్డారు.

నీటిని విడుదల చేసే క్రమంలో, కాలువ నుంచి ఎల్లారెడ్డిపేట చెరువులోకి నీటిని విడుదల చేసే సమయంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవటం వల్ల మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, మెగా కంపెనీ ప్రెసిడెంట్ గోవర్దన్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నాలుగు రోజుల నుంచి నీటి విడుదల కార్యక్రమం ఉంటుందని చెప్పినా... కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవంటపై మండిపడ్డారు. కాలువ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి రాకుండానే మంత్రి హరీశ్​రావు తిరిగి వెళ్ళిపోయారు.

నీటి విడుదల కార్యక్రమంలో అధికారులపై మంత్రి హరీశ్​ ఫైర్​

ఇదీ చదవండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.