ETV Bharat / state

Harish Rao: ధాన్యం కొనాలని కేసీఆర్​కు ఉంది.. కేంద్రమేమో లేఖ రాసింది... - Harish Rao comments

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలో రైతు వేదికను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మాచాపూర్, చౌడరం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు సన్​ఫ్లవర్ విత్తనాలను మంత్రి అందజేశారు.

minister Harish Rao comments on paddy purchase in telangana

author img

By

Published : Nov 6, 2021, 4:00 PM IST

Updated : Nov 6, 2021, 4:31 PM IST

ధాన్యం కొనాలని కేసీఆర్​కు ఉంది.. కేంద్రమేమో లేఖ రాసింది...

మారుతున్న పరిస్థితులకు, మార్కెట్​కు అనుగుణంగా రైతులు మారాలని మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు గడించవచ్చని హరీశ్​రావు వివరించారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలో రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు ప్రోత్సాహం, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మాచాపూర్, చౌడరం గ్రామాల్లో సభ్యత్వం పొందిన 750 మంది రైతులకు సన్​ఫ్లవర్ విత్తనాలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే లక్ష్యం..

రైతు ఉత్పత్తిదారుల సంస్థ- ఎఫ్​పీఓ కార్యక్రమాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని, రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే దాని ఉద్దేశమని మంత్రి వివరించారు. పంటమార్పిడి విధానంలో భాగంగా చిన్నకోడూర్ మండలంలో వెయ్యి ఎకరాలకు పొద్దు తిరుగుడును సాగు చేయనున్నట్టు తెలిపారు. దీని వల్ల రైతులకు నేరుగా మద్దతు ధర వస్తుందన్నారు. పొద్దు తిరుగుడు పువ్వు, తేనేటీగల పెంపకం ద్వారా వచ్చే లాభాల గురించి 700 మంది రైతులకు విడతల వారీగా రైతు వేదికలో రోజూ శిక్షణ జరపాలని ఆయా సంస్థ శాస్త్రవేత్తలు, ప్రతినిధులను మంత్రి కోరారు. యాసంగిలో సన్​ఫ్లవర్ పంటలకు మంచి దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు రైతులను చైతన్య పర్చాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుతో మరింత లాభం..

"ప్రత్యామ్నాయ పంటల సాగులో పని తక్కువ, ఫలితం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులు ముందుకు రావాలి. నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం 90 వేల కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యం కోల్పోతోంది. పామాయిల్ సాగు లాభసాటిగా ఉంటుంది. నూనె ఉత్పత్తులు, పప్పు దినుసుల పంటలు పండించాలి. చిన్నకోడూర్ మండలంలో ఎఫ్​పీఓ వెయ్యి ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఓ వరం. ఇక వడ్లు కొనలేమని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. సీఎం కేసీఆర్ 3 సార్లు దిల్లీ వెళ్లి వడ్ల విషయంలో చర్చించి వచ్చారు. అయినా మార్పు రాలేదు. ఎఫ్​సీఐ నాలుగు ఏళ్లకు సరిపడే ధాన్యం నిండిందని.. ఈ యాసంగికి వడ్లు కొనమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈసారి సిద్ధిపేట జిల్లాలో రికార్డు స్థాయిలో 7 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో పండిన పంట మొత్తం కొనడానికి కొనుగోలు కేంద్రాలు, నిధులు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. పండిన పంట ఎక్కడ పెట్టాలన్నదే ఇప్పుడు సమస్యగా మారింది." - హరీశ్​రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చూడండి:

Last Updated : Nov 6, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.