యువతకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమేనని... మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పలు గ్రామాల్లో నూతన పాఠశాల భవనాలు, రైతు వేదికలు, మహిళ సమైక్య సంఘ భవనాలు, గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ బౌలింగ్ చేయగా... హరీశ్ రావు బౌండరీలు కొట్టి అలరించారు. త్వరలోనే హుస్నాబాద్‌లో స్టేడియం, కోహెడలో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రజలకు ఆసరాగా సంక్షేమ పథకాలు: జగదీశ్‌రెడ్డి