ETV Bharat / state

'ఫించన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 1.8శాతం మాత్రమే'

సిద్దిపేటలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను మంత్రులు హరీశ్​, ఈశ్వర్ పంపిణీ చేశారు. జిల్లాలో 516 మంది లబ్ధిదారులకు 80లక్షల విలువ గల ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు.

harish
'ఫించన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 1.8శాతం మాత్రమే'
author img

By

Published : Apr 15, 2021, 10:07 AM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను మంత్రులు హరీశ్​ రావు, కొప్పుల ఈశ్వర్​లు పంపిణీ చేశారు.

జిల్లాలో 516 మంది లబ్ధిదారులకు 80లక్షల విలువ గల ఉపకరణాలు అందిస్తున్నామన్నారు. తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి సాయం చేసేందుకు బడ్జెట్​లో 10వేల కోట్లు కేటాయించామని తెలిపారు. దివ్యాంగులను చిన్నచూపు చూడటం తప్పు.. వారికి చేయూతనివ్వాలని సూచించారు. వాళ్లను అవమానిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందంరికి ప్రభుత్వం ఉపకరణాలను అందిస్తుందని ప్రకటించారు.

దివ్యాంగులకు దేశంలో మరెక్కడా కూడా లేని విధంగా ఒక్కొక్కరికి 3,016రూపాయల చొప్పున పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఈ పింఛన్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 1.8శాతం మాత్రమేనని వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట పట్టణ ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సహపంక్తిలో మంత్రులు కొప్పుల, హరీశ్​రావు దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.

ఇదీ చూడండి: కొవిడ్‌ నేపథ్యంలో బిడ్డల భవిష్యత్తుపై కలవరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.