సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింహులు కుటుంబాన్ని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి.. ఇవ్వకుండా ఉన్న భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తోందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ రైతుకు చెందిన 13 గుంటల భూమిని రైతు వేదిక నిర్మాణం పేరుతో తీసుకోవడమే నర్సింహులు ఆత్మహత్యకు కారణం అయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్నా హామీ ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు. దళితుల భూములు తీసుకుంటే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'భయంగా ఉంది... ప్రాణాలతో ఇంటికి వెళ్తానో? లేదో?'