ETV Bharat / state

కొమురవెల్లిలో నేడు మల్లికార్జునస్వామి కల్యాణం - komuravelli Mallikarjuna swami kalyanam

కోరమీసాల కొమురవెళ్లి మల్లికార్జున స్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Komuravelli
కొమురవెల్లి మల్లికార్జునస్వామి
author img

By

Published : Jan 10, 2021, 1:12 AM IST

Updated : Jan 10, 2021, 4:51 AM IST

కొమురవెల్లిలో నేడు మల్లికార్జునస్వామి కల్యాణం

నేడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జరగనుంది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల వివాహం జరుగుతుంది. వధువుల తరుపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరిస్తారు. మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు మల్లన్న కల్యాణంతో అంకురార్పణ జరగనుంది.

తెల్లవారుజాము నుంచే..

తెల్లవారుజాము నుంచే కల్యాణోత్సవ క్రతువు ప్రారంభం కానుంది. ఉదయం ఐదు గంటలకు దృష్ఠికుంభం, బలిహరణం నిర్వహిస్తారు. గర్భాలయం నుంచి ఊరేగింపుగా స్వామి, అమ్మవార్ల మూర్తులను కల్యాణ వేదిక మీదకు తీసుకువస్తారు. 10.45నిమిషాలకు కల్యాణం నిర్వహించునున్నారు. అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

50 వేల మంది భక్తులు

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి మల్లన్న కల్యాణం తిలకించడానికి 50 వేల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. కరోనా దృష్ట్యా మాస్కు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్వాహకులు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం సిద్దిపేట, గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

కొత్తకొండలో బ్రహ్మోత్సవాలు..

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ప్రారంభం కానున్నాయి. ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 13న భోగి, 14న సంక్రాంతి, 18న అగ్నిగుండాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి: పశువులకూ హాస్టళ్లు... పాడిపరిశ్రమ అభివృద్ధికి సోపానాలు

Last Updated : Jan 10, 2021, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.