సిద్దిపేట జిల్లాలోని కోర మీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో ఆర్జిత సేవలతోపాటు భక్తుల దర్శనాలు వారం రోజుల పాటు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ విజృంభిస్తుండడం వల్ల ఆలయంలో కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 5 నుంచి 11 వరకు అన్ని రకాల ఆర్జిత సేవలతోపాటు భక్తుల దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు, పూజలు అర్చకులచే అంతరంగికంగా నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెరాస నేతల ధ్వజం