ETV Bharat / state

'పీఎం స్వనిధి'తో వీధి వ్యాపారులకు కేంద్రం భరోసా.! - వీధి వ్యాపారులకు కేంద్ర ఆర్థిక సాయం వార్తలు

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతోన్న వీధి వ్యాపారులకు కేంద్రం ఆపన్న హస్తం అందిస్తోంది. పీఎం స్వనిధి నుంచి ప్రతి వ్యాపారికి రూ.10 వేల చొప్పున రుణం మంజూరు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ గుర్తింపు ఉన్న 5186 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది.

Loans through PM Swanidhi Scheme for Street Vendors
వీధి వ్యాపారులకు కేంద్రం భరోసా.. పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు
author img

By

Published : Jul 20, 2020, 4:01 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం చేయూతను అందిస్తోంది. చిరు వ్యాపారులు పెట్టుబడి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కేంద్రం పీఎం స్వనిధి నుంచి ప్రతి ఒక్కరికి రూ.10 వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. సిద్దిపేటలో పండ్లు, కూరగాయలు, పువ్వులు, పానీపూరి, టీ ఇతర వ్యాపారాలు చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మెప్మా అధ్వర్యంలో అలాంటి వారి వివరాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను మున్సిపల్ వెబ్​సైట్​లో పొందుపరుస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు కూడా సేకరించి అందులో నమోదు చేస్తున్నారు.

ప్రతి నెలా రూ.950 చెల్లించాలి..

రూ.10 వేల రుణం పొందిన వ్యాపారులు.. ప్రతి నెలా 950 రూపాయల చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపేణా అదనంగా 1,140 చెల్లించాల్సి వస్తోంది. ఏడాదిలోగా అప్పు తీరిస్తే.. మళ్లీ రూ.20వేలు పొందే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్​రావు తెలిపారు.

డిజిటల్​ లావాదేవీలు చేయాలి..

పీఎం స్వనిధి కింద రుణం తీసుకునే వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లావాదేవీల సంఖ్య 200 దాటితే 100 రూపాయలు ఖాతాలో జమ చేస్తారన్నారు. వాటి కోసం ప్రతి ఒక్క వ్యాపారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కార్డును అందిస్తున్నారు.

జిల్లాలో 5,186 మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు తెలిపారు. పట్టణ జనాభా ఆధారంగా వీధి వ్యాపారులను గుర్తించాల్సి ఉంటుందని.. జిల్లాకు 5 కోట్ల 18 లక్షలు కేటాయించారని వెల్లడించారు.

వీధి వ్యాపారులకు కేంద్రం భరోసా.. పీఎం స్వనిధి పథకం ద్వారా రుణాలు

ఇదీచూడండి: వర్షాకాలంలో మీ చిన్నారుల ఆరోగ్యం జాగ్రత్త ఇలా!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.