రెండో యాదాద్రిగా పేరొందిన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మూడో రోజూ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి తిరు కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతాప్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
భక్తుల జయజయధ్వానాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుని కల్యాణం ఘనంగా జరిగింది. కల్యాణం అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: వైద్య సలహాలు మేం పాటిస్తాం.. మీరూ పాటించండి