సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వాగులో గల్లంతైన శ్రీనివాస్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్దిపేట కలెక్టర్‌తో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలిలో సిద్దిపేట ఆర్డీవో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపైనా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి దర్గాపల్లి వద్ద వాగులో సిరిసిల్ల జిల్లా తెరాస నాయకుడు శ్రీనివాస్ గల్లంతయ్యారు.
ఇదీ చూడండి : తెలంగాణలో 894 కరోనా కేసులు, 10 మరణాలు