ETV Bharat / state

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం - minister harishrao news

కొమురవెల్లి మల్లన్న కల్యాణం కన్నుల పండుగగా సాగింది. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం మల్లికార్జున స్వామి, మేడలమ్మ, గొల్లకేతమ్మల... వివాహ వేడుకను పండితులు నిర్వహించారు. మహారాష్ట్రలోని బార్సీ మఠానికి చెందిన సిద్ధగురు మణికంఠ శివాచార్యులు కల్యాణ క్రతువును పర్యవేక్షించారు. ప్రభుత్వం తరుపున మంత్రి హరీశ్‌రావు స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

author img

By

Published : Jan 11, 2021, 3:56 AM IST

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

మార్గశిర మాసం చివరి ఆదివారం.. ప్రతి ఏటా కొమరవెల్లి మల్లన్న స్వామికి కల్యాణం జరిపించడం ఆనవాయితీ. దిష్టికుంభం. బలిహరణంతో రుత్వికులు క్రతువును ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వామివారి తొలిదర్శనం కల్పించారు. గర్భాలయం నుంచి మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ మూర్తులను... ఉరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. వేలాదిమంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య కోరమీసాల మల్లన్న వివాహం జరిగింది. వధువుల తరుపున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరుపున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.

మంత్రుల చదివింపులు..

కల్యాణంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్లొన్నారు. మంత్రి హరీశ్‌ రావు.. మల్లికార్జున స్వామికి కన్యాదానం కింద... రూ.లక్షా వెయ్యి పదహారు సమర్పించగా.. మంత్రి మల్లారెడ్డి మల్లికార్జున స్వామి తరుపున మేడలమ్మ, కేతలమ్మలకు... రూ.లక్షా వెయ్యి పదహారు సమర్పించారు. కల్యాణ అనంతరం మంత్రులు హరీశ్‌ రావు, మల్లారెడ్డి గర్భగుడిలోని ములవిరాట్‌లను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మల్లన్న కల్యాణంతో 3 నెలల పాటు జరిగే.. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాది వరకు ఈ వేడుకలు సాగనున్నాయి.

ఇవీ చూడండి: భద్రాద్రిలో వైభవంగా విశ్వరూప సేవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.