ETV Bharat / state

మంత్రి హరీశ్​ సమక్షంలో వందమంది తెరాసలో చేరిక - dubbaka by elections latest news

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్​రావు సమక్షంలో వందమంది తెరాసలో చేరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దుబ్బాకలో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

joinings in trs in the presence of minister harish rao in siddipet district
మంత్రి హరీశ్​ సమక్షంలో వందమంది తెరాసలో చేరిక
author img

By

Published : Oct 6, 2020, 11:42 PM IST

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే దుబ్బాకలో తెరాసను భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాయని మంత్రి హరీశ్​ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్​లో దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాధవి చంద్రశేఖర్​తో పాటు సుమారు వంద మంది తెరాసలో చేరారు. వారికి కండువా కప్పి మంత్రి హరీశ్​రావు పార్టీలోకి ఆహ్వానించారు.

మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకున్న వారికి ప్రజలు ఓట్లెలా వేస్తారని మంత్రి అన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి తాగునీటిని అందించామని... ప్రతి ఎకరానికి సాగునీరు కూడా అందిస్తామని హరీశ్​ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, భాజపా నాయకులు ప్రాజెక్టును అడ్డుకుంది వాస్తవమా.. కాదా.. అది నిజం కాదని దుబ్బాక అంబేడ్కర్​ చౌరస్తా వద్ద చర్చకు వస్తారా అంటూ హరీశ్​ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ​ హయాంలో కరెంట్​ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. భాజపా ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టం తీసుకొచ్చి రైతులను కష్టాల్లోకి నెడుతోందని మంత్రి హరీశ్​ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.