ETV Bharat / state

నష్టపోయిన పంటలను పరిశీలించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే

హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వడగండ్ల వర్షం వల్ల నాశనమైన పంటలను స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్ పరిశీలించారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే పరిశీలన
author img

By

Published : Apr 20, 2019, 10:24 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను స్థానిక ఎమ్మెల్యే సతీశ్​కుమార్ పరిశీలించారు. కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాలలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. మామిడి, వరి, మొక్కజొన్న పంటలు వడగళ్ల వర్షాలకు పూర్తిగా నాశనమయ్యాయి. పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రైతులకు పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పిడుగుపాటుకు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

హుస్నాబాద్ ఎమ్మెల్యే పరిశీలన

ఇవీ చూడండి: 'సేకరించిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించండి'

Intro:TG_KRN_101_20_PANTA NASHTAM_MLA PARISHILANA_AVB_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాలలోని గ్రామాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన పంటలను హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. మామిడి, వరి, మొక్కజొన్న పంటలు ఈ వడగండ్ల వర్షాలకు పూర్తిగా నాశనమయ్యాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గ్రామాలలోని మామిడి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 18 19 వ తేదీలలో నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి మండలాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు మామిడి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.అదేవిధంగా అక్కన్నపేట కోహెడ మండలాలలో కొన్ని గృహాలు కూడా కూలిపోవడం జరిగిందని. దాదాపు ఒక కిలో వరకు బరువు తో కూడిన వడగండ్లు పడ్డాయని పిడుగుపాటుతో నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయారని, నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకున్నారని నష్ట తీవ్రతను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు, కుటుంబాలకు పరిహారం అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.

Body:బైట్

1) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:హుస్నాబాద్ యోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వడగండ్ల వర్షం వల్ల నాశనమైన పంటల పరిశీలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.