దేశ రక్షణకై అసువులు బాసిన వీర జవాన్లకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భాజపా నేతలు కొవ్వత్తులతో ఘన నివాళులు అర్పించారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దేశానికి చెందిన 20 మంది సైనికులు వీర మరణం పొందటం బాధకరమని పేర్కొన్నారు.
తెలంగాణ ముద్దు బిడ్డ కర్నల్ సంతోష్‌బాబు మరణం ఈ దేశానికి తీరని లోటని... వారి త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుచిపోతుందన్నారు. వారి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.