ETV Bharat / state

మతిస్థిమితం లేని వ్యక్తికి సపర్యలు చేసిన​ పోలీసులు - husnabad police station news

మతిస్థిమితం లేక భిక్షాటన చేస్తూ రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు హుస్నాబాద్​ పోలీసులు. విధి నిర్వహణే గాక ఆపదలో ఉన్న వారిని కాపాడి పట్టణ ప్రజలు, ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నారు.

husnabad, police, humanity
హుస్నాబాద్​, పోలీసులు, మానవత్వం
author img

By

Published : Jan 8, 2021, 7:38 PM IST

మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై భిక్షాటన చేస్తూ తిరుగుతున్న వ్యక్తిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ పోలీసులు చేరదీసి, సపర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలో కొన్నేళ్లుగా బలరామ్ అనే వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ శ్రీధర్ శుక్రవారం ఉదయం.. పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రహదారి పక్కన నిద్రిస్తున్న బలరామ్​ను పోలీస్ స్టేషన్​కు తీసుకువెళ్లారు. అతనికి స్నానం చేయించి, కొత్త బట్టలు ఇప్పించి భోజనం పెట్టారు.

అనంతరం బంధువుల గురించి ఆరా తీయగా పోతారం గ్రామంలో అన్నదమ్ములు ఉన్నారని బలరామ్​ చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి విచారించి అతని సోదరులు నారాయణ, బక్కయ్యలను స్టేషన్​కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి పలువురు పట్టణ ప్రజలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

ఇదీ చదవండి: రాష్ట్రాభివృద్ధిలో సాంకేతికత ప్రధానమైనది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.