సిద్దిపేట జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, గట్లమల్యాలతో పాటు పలు గ్రామాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షం రావడం వల్ల కాయలు నేలరాలాయి. ఫలితంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మామిడి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఎవరూ ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెంచొద్దు'