సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని గోవర్ధనగిరి, వరదరాజుపల్లి, ఘనాపూర్లో మొక్కజొన్న మిడతలు పంజా విసురుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే వందల ఎకరాల మక్క పంటను నాశనం చేశాయి. పరిస్థితిని గుర్తించి.. అప్రమత్తమైన వ్యవసాయ శాఖ.. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివిధ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. మిడతల నమూనాలు, రైతుల నుంచి వివరాలు సేకరించారు. మిడతల గుంపు దాడి వల్ల పూర్తిగా నష్టపోయామని.. పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని కర్షకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం