ETV Bharat / state

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

మరో వేములవాడగా ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే బారులు తీరారు. వారికోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

హుస్నాబాద్​ రాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

author img

By

Published : Feb 21, 2020, 2:50 PM IST

Updated : Feb 21, 2020, 7:55 PM IST

తెలంగాణలోని శైవ పుణ్యక్షేత్రాలలో మరో వేములవాడగా ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం హుస్నాబాద్ బస్టాండ్ నుంచి పొట్లపల్లి దేవాలయం వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు శివ సత్తులకు వారి కానుకలను సమర్పిస్తున్నారు. స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడి మొక్కులను చెల్లిస్తున్నారు.

హుస్నాబాద్​ రాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

Last Updated : Feb 21, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.