ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడు మృతి! - చేపల వేటకు వెళ్లి మృతి

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృత్యువాత పడ్డ ఘటన సిద్ధిపేట జిల్లా తొగుట మండలం పల్లెపహాడ్​ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లయ్య.. కయ్య చెరువులో చేపలకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి చెరువులో గాలించగా మృతదేహమై దొరికాడు.

Fisher Man Died in Siddipet District
చేపల వేటకు వెళ్లి.. మత్స్యకారుడు మృతి!
author img

By

Published : Aug 28, 2020, 9:58 AM IST

సిద్ధిపేట జిల్లా తొగుట మండంల పల్లపహాడ్​ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివలింగు మల్లయ్య రెండు రోజుల క్రితం కయ్య చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. సాయంత్రం చీకటి పడినా తిరిగి రాకపోగా.. మల్లయ్య కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి చెరువులో గాలించారు. రెండు రోజుల అనంతరం మృతదేహమై దొరికాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మరణించడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. తొగుట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.