ETV Bharat / state

యూరియా కోసం పీఏసీఎస్​ ముందు రైతుల బారులు - యూరియా కోసం బారులు తీరిన రైతులు

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇన్ని రోజులుగా ఎదురుచూస్తుంటే... రెండుమూడు బస్తాలు ఇస్తే ఎలా సరిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers heavy que line in front of mirudoddi pacs
యూరియా కోసం పీఏసీఎస్​ ముందు రైతుల బారులు
author img

By

Published : Aug 18, 2020, 4:46 PM IST

వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల అన్నదాతలు యూరియా బస్తాల కోసం... సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా లారీ రాగానే రైతులంతా పెద్ద ఎత్తున గుమిగూడారు. పంటలకు సరిపడా యూరియా రాకపోవడం వల్ల అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కో రైతుకు రెండుమూడు బస్తాలు మాత్రమే ఇస్తే... ఎలా సరిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పదిహేను రోజుల నుంచి రైతులు ఎదురుచూస్తుంటే... సరిపడా యూరియా ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మొగుళ్ల మల్లేశం విమర్శించారు. తక్షణమే స్పందించి... యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.