సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో లావుడ్యా మోతిరాం నాయక్ తన వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. పొలం దగ్గర ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ బావి మోటార్‌కు ఉన్న సర్వీస్ వైరు పైకి లేపే క్రమంలో విద్యుత్ సరఫరా జరిగి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న భార్య కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే రైతు మృతి చెందాడు.
ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్