సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు ఓ వ్యక్తి పరీక్ష సామగ్రి పంపిణీ చేశాడు. పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన నేతి కైలాష్ తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు చేతి గడియారాలు, పెన్నులు, పరీక్ష అట్టలు, పండ్లు అందజేశాడు.
విద్యార్థులంతా పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కైలాష్ ఆకాంక్షించాడు. పాఠశాలలో విద్యార్థులకు తన వంతు సాయం అందజేస్తున్న దాతను ఉపాధ్యాయులు అభినందించారు. పదోతరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విద్యార్థులు తెలిపారు.