సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎస్ఎల్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఆధ్వర్యంలో డైరెక్టర్ రాజారత్నం పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు, తోపుడు బండ్ల కార్మికులకు, జర్నలిస్టులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎస్ఎల్ గ్రూప్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతుందని... అందులో భాగంగా హుస్నాబాద్‌లోని మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని రాజారత్నం తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని కోరారు. కరోనా మహమ్మారిని నిర్మూలనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత పాల్గొన్నారు.