సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదాతలు తొలిసారిగా నాగలి పట్టి దున్నే ముందు... భూమి పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం ప్రకారం... వర్ష రుతువులో జేష్ఠ్య పౌర్ణమి రోజున... ఏరువాక పర్వదినంగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో.... ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో... పొలం పనులను ప్రారంభిస్తారు.
ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ శర్మ ఆధ్వర్యంలో... గ్రామంలోని పలువురు రైతులను సత్కరించారు. ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి... వాటిని అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు ఎంతో మంచిదని... అందుకే రైతులు భూదేవికి ప్రత్యేక పూజలు చేసి పనులు ప్రారంభిస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి: DIESEL PRICE EFFECT: రైతుకు ఆవేదన... పెరిగిన ట్రాక్టర్ల కిరాయిలు, రవాణా ఖర్చులు