ETV Bharat / state

Electric Bike Explosion: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఇల్లు దగ్ధం - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

Electric Bike Explosion: రాష్ట్రంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది.

ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది
ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది
author img

By

Published : Jun 8, 2022, 7:33 PM IST

Electric Bike Explosion: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ కొద్ది నెలల క్రితం ఎలక్ట్రిక్ బైక్​ను కొనుగోలు చేశారు. నిన్న రాత్రి తన ఇంటి ఎదురుగా ఉన్న దుర్గయ్య నివాసం వద్ద బైక్​ను పార్క్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో లక్ష్మీ నారాయణ బయటకు వచ్చి చూసే సరికి బైక్ పేలడంతో పక్కనే ఉన్న దుర్గయ్య ఇంటికి మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దుర్గయ్య ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రానికి చల్లని కబురు.. నేడు, రేపు అక్కడక్కడ జల్లులు!

పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం.. 90 వాహనాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.