సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కూడవెళ్లిలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు సమక్షంలో రేషన్ డీలర్లంతా తెరాస అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
కేంద్రం ప్యాకేజీ వద్దన్నాం
దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మీటర్లు పెడితే 2,500 కోట్ల ప్యాకేజీ ఇస్తామని చెప్పినా... ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల శ్రేయస్సు కోసం ప్యాకేజీ వద్దనుకున్నారని తెలిపారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్యాకేజీలు తీసుకుని మీటర్లు పెడుతున్నారని పేర్కొన్నారు.
డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం
దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఓటు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమం మా బాధ్యతని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. శిక్షణ షురూ