ETV Bharat / state

వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - అత్యధిక కేసులు పరిష్కరించిన వ్యక్తిగా రికార్డ్ - JUSTICE AMARNATH GOUD NEW RECORD

వండర్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - 91,157 కేసులు పరిష్కరించిన జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ - రాజ్​భవన్​లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్​ ప్రదానం

Justice Amarnath Goud Holds the Wonder Book of International Records
Justice Amarnath Goud Holds the Wonder Book of International Records (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 8:20 PM IST

Updated : Nov 16, 2024, 8:43 PM IST

Justice Amarnath Goud Holds the Wonder Book of International Records : త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్​ నాథ్​ గౌడ్​కు అరుదైన ఘనత దక్కింది. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించిన జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్ వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్​ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా జస్టిస్ అమర్​నాథ్ గౌడ్​కు తెలంగాణ గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ గురువారం రాజ్​భవన్​లో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్​ను ప్రదానం చేశారు.

Justice Amarnath Goud Holds the Wonder Book of International Records
జస్టిస్ అమర్​నాథ్​ గౌడ్​కు అవార్డు ప్రదానం చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (ETV Bharat)

జస్టిస్ అమర్​నాథ్ గౌడ్ 2017 నుంచి ఇప్పటివరకు 91 వేల 157 కేసులు పరిష్కరించారు. రోజుకు సరాసరి 109 కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. హైదరాబాద్​కు చెందిన జస్టిస్ అమర్​నాథ్ గౌడ్ 2017లో తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021 అక్టోబరు 28న త్రిపుర హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.

తెలంగాణలోనే రికార్డు స్థాయిలో కేసులు పరిష్కృతం : జస్టిస్ అమర్​నాథ్ గౌడ్ 2022 నవంబరు 11 నుంచి 2023 ఏప్రిల్ 16 వరకు త్రిపుర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టులో 40శాతం పెండింగు కేసులను, త్రిపుర హైకోర్టులో 60 శాతం పెండింగు కేసులను పరిష్కరించారు.

"జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చెప్పుకోదగ్గ రికార్డును సాధించారు. 2017 నుంచి 2024 వరకు హైదరాబాద్, త్రిపుర హైకోర్టులలో 91,157 వ్యక్తిగత కేసులను పరిష్కరించడంలో వారి అసాధారణమైన విజయాన్ని మేము గుర్తించాం, రోజుకు సగటున 109 కేసులను పరిష్కరించారు. మీ అత్యుత్తమ నిబద్ధత న్యాయ సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది." - వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్

రాజ్​భవన్​లో గురువారం జరిగిన కార్యక్రమానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, లయన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్​లో చోటు సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

'ప్రభుత్వ' కార్యక్రమాలపై ప్రచారం.. వరల్డ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం

100 కిలోల కేక్​తో అద్భుత కళాఖండం- ప్రపంచ రికార్డ్ 'ఆమె' సొంతం

Last Updated : Nov 16, 2024, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.