ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - అంజలి ఘటించిన ప్రముఖులు - RAMOJI RAO BIRTH ANNIVERSARY 2024

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - ఆయన సేవలను స్మరించుకున్న ప్రముఖులు

Ramoji Rao Birth Anniversary 2024
Ramoji Rao Birth Anniversary 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 8:30 PM IST

Ramoji Rao Birth Anniversary 2024 : అక్షర యోధుడు, అలుపెరుగని ధీరుడు దివంగత రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అంజలి ఘటించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడారు. ఆయన బాటలోనే ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు జయంతి వేడుకలు - అంజలి ఘటించిన ప్రముఖులు (ETV Bharat)

విద్యార్థుల అభ్యున్నతికి బాటలు : రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావు 88వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సమాజానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు రామోజీరావు నాంది పలికారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. విద్యార్థుల అభ్యున్నతికి రామోజీరావు బాటలు పరిచారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌ సిబ్బంది పేర్కొన్నారు. రామోజీరావు చిత్రపటం వద్ద అంజలి ఘటించి మౌనం పాటించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

రామోజీరావు - ఓ మహాగ్రంథం.. ఓ స్ఫూర్తి కేంద్రం - Ramoji Rao Quotes

సికింద్రాబాద్ వారాసిగూడలో బీజేపీ సీనియర్ నాయకుడు రవిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. వ్యాపార, వాణిజ్య, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మీడియా రంగంలోనూ నూతన శకాన్ని ఆవిష్కరించారన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో రామోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ప్రతి విద్యార్థి రామోజీరావును స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ నీలి శ్రీనివాసులు కాంక్షించారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నటికీ మర్చిపోలేనివన్నారు. ఎంతో మంది మంచి జర్నలిస్టులను పరిచయం చేసిన వ్యక్తి ఆని కొనియాడారు. విద్యార్థి, విద్యార్థినీలతో కలిసి ఆయన చిత్రపటం వద్ద టెంకాయ కొట్టి అంజలి ఘటించారు. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన ఓ సూక్ష్మ కళాకారుడు అబ్బురపరిచేలా పెన్సిల్‌తో రామోజీరావు చిత్రాన్ని వేయడంతో పాటు కోడిగుడ్డుపై ఆయన చిత్రాన్ని వేసి ఘనంగా నివాళులర్పించారు.

మహా స్వాప్నికుడా.. మళ్లీ జన్మించు!

'కఠోరమైన క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు - యువత ఈ లక్షణాలను అలవర్చుకోవాలి' - Ramoji Rao Memorial Meeting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.