ETV Bharat / sports

తిలక్ వర్మ కొత్త హెయిర్ స్ట్రైల్- 'పుష్ప 3' కోసమేనా? - TILAK VARMA PUSHPA

తిలక్ వర్మ కొత్త హెయిర్ స్ట్రైల్- 'పుష్ప 3' కోసమేనా?

Tilak Varma Pushpa
Tilak Varma Pushpa (Source : AP (Left), ETV Bharat (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Nov 16, 2024, 8:02 PM IST

Tilak Varma Allu Arjun Pushpa : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్‌ వర్మ సూపర్ ఫామ్​తో దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్​లో 'తగ్గేదే లే' అన్నట్లుగా బ్యాట్​తో చెలరేగిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టాడు. అయితే ఈ సిరీస్​లో తిలక్ వర్మ కొత్త లుక్స్​తో కనిపించాడు. ఈ నేపథ్యంలో అతడి లుక్‌ చూసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పోలుస్తున్నారు.

సౌతాఫ్రికాతో శుక్రవారం నాలుగో టీ20 ముగిసిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్‌తో ఓ సరదా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సమయంలో తిలక్‌ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. 'తిలక్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీ జుట్టు సీక్రెట్ ఏంటి. నీ జుట్టు చూసి అందరూ అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. ఏంటి ఇది. అతడు తెలుగు సూపర్ స్టార్, మరి నువ్వు' అని ప్రశ్నించాడు.

దీనికి తిలక్ కూడా రిప్లై ఇచ్చాడు. 'అలా ఏమీ లేదు. నా పొడవాటి జుట్టు చూసి అల్లు అర్జున్ పిలవడం మొదలు పెట్టింది మీరే. 'నువ్వు చూడటానికి అల్లు అర్జున్‌లా కనిపిస్తున్నావు అన్నారు' ఒక్కసారి ఏదైనా అన్నారంటే అది త్వరగా వ్యాపిస్తుంది. అయితే జుట్టు పొడవుగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ ఫీల్‌ బాగుంటుంది. అది నాకు నచ్చుతుంది' అని చెప్పాడు.

ఇక 'పుష్ప- 3 సినిమాలో నటించాలనుకుంటున్నావా' అని సూర్య అడిగాడు. దానికి తిలక్ నవ్వుతూ 'అయ్యో అదేం లేదు. నా పని గ్రౌండ్‌లో బ్యాట్, బంతితో రాణించడం. గ్రౌండ్‌ బయట కష్టపడి ప్రాక్టీస్ చేయడం. మిగతావన్నీ పైనున్న దేవుడి నుంచి వస్తాయి' అన్నాడు. ఈ సమాధానం విన్న సూర్య 'ఈ కుర్రాడు ఎంత నిజాయితీపరుడు' అంటూ ఫన్నీ ఇంటర్వ్యూని ముగించాడు.

విరాట్ రికార్డ్ బ్రేక్ :సౌతాఫ్రికా సిరీస్​తో తిలక్ వర్మ అద్భుతమైన ఘనత సాధించాడు. ఓ టీ20 సిరీస్​లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా రికార్డు కొట్టాడు. నాలుగు మ్యాచ్​ల ఈ సిరీస్​లో తిలక్ 198 స్ట్రైక్ రేట్​తో 280 పరుగులు బాదాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (231 పరుగులు vs ఇంగ్లాడ్​) రికార్డ్ బ్రేక్ చేశాడు.

రోహిత్​కు శుభాకాంక్షల వెల్లువ- ఎమోషనలైన తిలక్ వర్మ!

మీకో ఫన్నీ విషయం చెప్పనా : సెంచరీపై తిలక్ వర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.