సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఉంచాలని, మున్సిపాలిటీ నుంచి తొలగించాలని గ్రామస్థులంతా ఏకమై సంతకాలు సేకరించి వినతి పత్రాన్ని గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి సమర్పించారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపినప్పటి నుంచి నల్లా బిల్లులు, కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, రోజువారి కూలీ పనులు చేసుకుని బతికే గ్రామస్థులను మున్సిపాలిటీ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. గ్రామస్థులంతా ఏకమై మున్సిపాలిటీ రద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం గ్రామంలోని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఇవీ చూడండి: మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ