సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అద్భుతంగా ఉందని సీఎస్ సోమేశ్‌కుమార్ (CS Somesh Kumar) అన్నారు. ఈ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు.
సీఎం ఆదేశాల మేరకు ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ముందుగా ములుగు మండలం తునికి బొల్లారంలోని కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిశీలించారు. గజ్వేల్‌లో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను సందర్శించి సౌకర్యాలు, క్రయవిక్రయాలపై వ్యాపారులతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ల నిర్మాణం కోసం రూ. 500 కోట్లు కేటాయించినట్లు సీఎస్ (Cs Somesh Kumar) స్పష్టం చేశారు. మార్కెట్ నిర్మాణంపై కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ, మున్సిపల్ ఛైర్మన్ ఎంసీ రాజమౌళి, కమిషనర్ వెంకట గోపాల్‌తో పాటు పలువురు ఉన్నారు.
ఇదీ చదవండి: School paintings: బడిగోడలపై చేనేతకు పట్టంకట్టిన సిరిసిల్ల పాఠశాల