కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ జిల్లా నిర్మాణ మహా సభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో బెల్టుషాపులు ఎక్కువై.. యువకులు మద్యానికి బానిసలవడం వల్ల నేరాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు. తాగుబోతుల తెలంగాణ కాదు బంగారు తెలంగాణ కావాలని కోరారు.
కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో దేశం నలిగిపోతోందని.. భాజపా ఒక మతతత్వ పార్టీ అని చాడ విమర్శించారు. నల్ల ధనం బయటకు తీసి ప్రతి ఒక్కరికీ 15 లక్షలు ఇస్తానన్న మోదీ 10 పైసలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువులపై ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారన్నారు.
ఇవీ చూడండి: 'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట!