సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో లాక్డౌన్ రెండోరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణ సముదాయాలను తెరిచి ఉంచారు. 10 తర్వాత వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి బయట తిరుగుతున్న వాహనదారులకు పోలీసులు జరిమానాలు విధించారు. కౌన్సిలింగ్ నిర్వహించారు.
అకారణంగా బయటకు వస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని వాహనదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏఎస్పీ మహేందర్ లాక్డౌన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బయటకు రావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. కరోనా పరీక్షలకు, టీకాలకు వెళ్లేవారికి.. అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.
ఇదీ చూడండి: కొవిడ్‌తో కొడుకు.. ప్రమాదంలో తండ్రి మృతి